అమెరికా టెడెక్స్ అంతర్జాతీయ వేదికపై తెలుగుతేజం.
తెలంగాణ యువతి స్నేహ అరుదైన దృశ్య ప్రసంగం.
హైదరాబాద్ నగర వాసి అమెరికాలో అత్యంత పేరు పొందిన టెడెక్స్ దృశ్య ప్రదర్శన అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే అరుదైన దృశ్య ప్రసంగ అవకాశం లభించింది. ఈ విషయాన్ని సంక్షిప్త సందేశం ద్వారా స్నేహ కుటుంబ సభ్యులకు పంపింది. దానికి వారు ఎంతో సంతోషంతో ఉన్నారు.
టెడెక్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఆవిష్కరణ ఆలోచనలతో ప్రపంచానికి తెలియ పరచేందుకు నిజాన్ని నిర్భయంగా ఒకరికొకరు పంచుకుని సమాజాన్ని సంతోషంగా ముందుకు నడిపేందుకు అవకాశం ఇచ్చే అమెరికా అంతర్జాతీయ దృశ్య శ్రవణ వేదిక.
టెడెక్స్ అమెరికా అంతర్జాతీయ దృశ్య శ్రవణ వేదికపై మాట్లాడే అవకాశం రావడమనేది చాలా అరుదైన విషయం. అందులో మాట్లాడే అవకాశం తెలంగాణ అమ్మాయికి రావడం చాలా గర్వ కారణం. అది కూడా ఒక చిన్న వయసులో 25 సంవత్సరాల స్నేహని వరించడం ఆమె ఒక్క తెలివితేటలకు, ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు, కష్టపడి పనిచేసే మనస్తత్వానికి, సమయస్ఫూర్తికి, ఆమె ఆలోచన శైలికి, ఈ సామాజిక స్పృహకు నిదర్శనం. ఈ విషయాన్ని ప్రపంచంలోని యువతీయువకులకకే కాకుండా తెలుగు ప్రజలకు ముఖ్యంగా యువతులకు గర్వించదగిన విషయం మరియు ఆదర్శంగా అభివర్ణించారు.
ఉద్యోగంలోనైనా, నిత్య జీవితంలోనైనా పని ద్వారా కలిగే ఒత్తిడిని ఎలా అధిగమించాలో, సరైన పద్ధతిలో మానసిక పరిస్థితులను ఏరకంగా అధిగమించాలో తన ప్రసంగం ద్వారా తెలియపరిచింది. తమ యొక్క ఆలోచన అనుభవ శైలితో విధి నిర్వహణలో, గృహ నిర్వహణలో పని వల్ల కలిగే ఒత్తిడి (స్ట్రెస్) ఏవిధంగా అధిగమించి సంతోషమైన జీవనాన్ని గడప వచ్చునో తన వీడియో ప్రసంగం ద్వారా ప్రపంచానికి తెలియపరిచింది. ఆసక్తి కలవారు తన వీడియో ప్రసంగాన్ని www.smtedx.com ద్వారా చూడవచ్చునని సందేశం పంపింది.
ఎంతో చురుకైన తమదైన ఆదర్శ భావాలతో పెరిగిన స్నేహ చిన్న వయసులోనే పై చదువుల కోసం అమెరికా వెళ్లి ఎం.ఎస్ పూర్తి చేసి అక్కడే పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుని, ఆదర్శాలను ధ్రువ పరుస్తూ పెద్దలతో సంబంధం కుదిరించుకుని తమ ప్రేమని ప్రేమ వివాహంగా మార్చుకొని తమ సహ విద్యార్థి శివ తేజ్ ని ప్రేమ వివాహం చేసుకొని యువతకు ఆదర్శంగా నిలిచారు.
తోటి ఉద్యోగులతో ఉద్యోగ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ, ఉద్యోగినిగా, గృహిణిగా, తల్లిగా, భార్యగా ఆదర్శ యువతిగా నూతన భావాలను యువతకు తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుతూ ఆదర్శంగా ఉంటూ ముందుకు నడుస్తోంది.