SAKSHITHA NEWS

తిరుపతి నగరం

తిరుపతి నగరమునకు నీటి సరఫరా చేయు తెలుగు గంగ నీటి పంపిణీ శనివారం మరమ్మత్తుల కోసం అంతరాయం కలుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. తెలుగు గంగ హెడ్ వాటర్
వర్క్స్ మెయింటెనెన్సు చేయుటలో భాగంగా యం.డి.పుత్తూరు పంపింగ్ స్టేషన్ నందు
క్రొత్త పంప్ అమర్చు చున్నారని, గురవరాజు పల్లి దగ్గర, అనాసంపల్లి
దగ్గర పంపింగ్ మెయిన్ పైపు నీరు లీకజి అరికట్టు పనిని చేపట్టుచున్నందున తిరుపతి
నగర ప్రజలకు 2వ తేది శనివారం నీటి సరఫరాకు అంతరాయము కలుగునని తెలిపారు.

ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా అత్యవసరమయిన
వార్డులలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు.
ట్యాంకర్ కొరకు సంప్రదించవలసిన అధికారులు
సంజీవ కుమార్ 9849907496 (వార్డు నెం. 4 నుండి 9 వరకు,
వార్డు నెం.12, 13)
దేవిక 9849983061 (వార్డు నెం.10, 11, వార్డు నెం.25 నుండి 27
వరకు, వార్డు నెం.32, 33)
మహేష్ 9949095227 (వార్డు నెం.3, వార్డు నెం. 14 నుండి 22
వరకు), విజయ్ కుమార్ రెడ్డి 9949905556 (వార్డు నెం.1, 2, 42, 43
వార్డు నెం.45 నుండి 50 వరకు) సంప్రదించ వచ్చని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.


SAKSHITHA NEWS