బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాం నగర్ లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లిశెట్టి శేఖర్ ఆధ్వర్యంలో, స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి జెండా ఆవిష్కరణ చేసి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పార్టీ తరపున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శ్రీరాం నగర్ కాలనీ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న బీఆర్‌ఎస్..తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించిందని చెప్పారు. ఏప్రిల్ 27, 2001 నాడు తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు కృషి చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది రైతుల కోసం, శ్రామికుల కోసం, కర్షకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం.. పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లోనూ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మల్లిశెట్టి శేఖర్, కుమార్ యాదవ్, కుమార స్వామి, రాజు సాగర్, ఉపేందర్, మల్లేష్, రాం రెడ్డి, నాగరాజు, ప్రవీణ్, వెంకటేష్, ధనుంజయ, నిఖిల్, శివ, సాయి కిషోర్, అరుణ్, విష్ణు, నరేష్, రఘు, గోపాల్, మహిళలు విమల, స్వప్న, శృతి, పర్వీన్ సుల్తానా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.