పెద్దపల్లి నియోజకవర్గం తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో పెద్దపల్లి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంక్షేమ శాఖమంత్రి మరియు పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అయినా శ్రీ కొప్పుల ఈశ్వర్ నిరంతరం పేదల పక్షాన ఉంటారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ, అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉండే మృదు స్వభావి, మా ప్రియతమ నాయకులని, వారి జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్లు, అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, రాబోవు రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు లైసెట్టి బిక్షపతి, గాదే మాధవి, పూదరి చంద్రశేఖర్,BRSV జిల్లా కో ఆర్డినేటర్ సతీష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎరుకల రమేష్, పెంచాల శ్రీధర్, పెద్ది వెంకటేష్, పాగాల శ్రీకాంత్, పునుకొండ సునీల్, ఖదీర్ ఖాన్, పైడ రవి కుమార్,దేవనంది దేవరాజ్, తాళ్లపల్లి మనోజ్ గౌడ్, BRS పార్టీ వార్డు అధ్యక్షులు కొట్టే లక్ష్మయ్య, కోట సమ్మయ్య గౌడ్,రైతుబంధు పెద్దపెల్లి పట్టణ కన్వీనర్ లక్కాకుల లింగయ్య,వెన్నం రవీందర్, కాశిపాక వాసు, పల్లె మధు, కముటం శ్రీధర్, బొంకూరి అఖిల్, జునైద్, తాళ్ల కళ్యాణ్, కుక్క మనోజ్, గొట్టెముక్కల శ్రీనువాస్, సముద్రాల రాజ్ కుమార్, గర్రెపల్లి సాయి, ప్రశాంత్, నర్ల సాయి, బైరం నటరాజ్, మంద రాజేందర్, మద్దెల భాగ్యరాజ్, ఎరగంటి దేవేందర్,ఇమామ్ అలీ, కుక్క మల్లేష్, ఎరగంటి శ్రీనివాస్, ప్రవీణ్ లతో పాటు పలువురు బీ ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.