తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ (IJU) ఉగాది నూతన డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్: దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజె (ఐజెయూ) ఉగాది – నూతన డైరీని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎల్ఆర్ఐటీ సంస్థ అధినేత డాక్టర్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గ పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడని అన్నారు. పొలంలో విత్తుని మొలకెత్తించడానికి రైతు తన శ్రమను ఎలా ధారపోస్తాడో, ఒక వార్తను సేకరించడానికి విలేఖరి తన సర్వశక్తులూ ఉపయోగిస్తాడన్నారు. తాను కూడా జర్నలిస్టు కావాలని చిన్ననాటి నుండి ఉండేదని, తప్పకుండా జర్నలిజం చదువు (మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం) త్వరలో పూర్తి చేస్తానని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బందులున్నా అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని చెప్పారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఐజేయు కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, రాష్ట్ర కోశాధికారి కే.మహిపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్(ఐజేయూ) జాయింట్ సెక్రటరీ ఎల్లంపల్లి నర్సింలు, సీనియర్ జర్నలిస్ట్ మెట్రో నర్సింగ్, జిల్లా వివిధ ప్రెస్ క్లబ్ ల అధ్యక్షకార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.