SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు (TSPCB) మెంబర్ సెక్రెటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన TSPCB సమావేశం జరిగింది. ఇట్టి సమావేశం లో పాల్గొన్న TSPCB సభ్యులు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తాండూర్లోని ఆసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతుంది అని దానివల్ల పరిసరాల్లో ఉన్న గ్రామ ప్రజలు మరియు స్కూల్ విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని తెలిపారు. అలాగే చందన్వెల్లి గ్రామంలోని కుందన్ టెక్స్టైల్స్ మరియు శంషాబాద్ లోని శ్రీ కృష్ణ డ్రగ్స్ ద్వారా కూడా పర్యావరణ కాలుష్యం జరుగుతుంది అని వాటి పై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. వీటి తో పాటు మోకిల గ్రామంలో నిర్మిస్తున్న విల్లాలు మరియు అపార్ట్మెంట్స్ నిర్మాణ వ్యర్థం మొత్తం గండిపేట చెరువులోకి వదులుతున్నారు అని తెలపడం జరిగింది దీని పై స్పందిస్తూ TSPCB బోర్డు సభ్యులు అందరూ మోకీల గ్రామంలోని నిర్మాణాలను సందర్శించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

WhatsApp Image 2024 04 17 at 4.07.32 PM

SAKSHITHA NEWS