SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదిన సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శేరిలింగంపల్లి విలేజ్ లోని శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన బోనాల ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఫలహారం బండి ఊరేగింపుని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవలనే ఉద్దేశ్యం తో నియోజకవర్గం లోని ప్రతి గుడికి బోనాల నిధులు మంజూరయేలా కృషి చేశానని ,బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకునేల  బోనాలు నిర్వహించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేయడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల అంగరంగా వైభవంగ పండుగల జరుపుకునేల కృషి చేస్తున్నారు అని , ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అన్ని రంగాలలో తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి కెసిఆర్  గారు  ముందుకు తీసుకెలుతున్నారని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.

బోనాల సందర్భంగా ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ అన్ని రకాల వసతులు కలిపిస్తూ ప్రశాంత వాతావరణం కలిపించమని, బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేల అన్ని ఏర్పాట్లను చేశామని, బోనాల పండుగ మంచి ప్రశాంత వాతావరణంలో జరిగినవి అని ప్రభుత్వ విప్ గాంధీ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, తెరాస నాయకులు కృష్ణ యాదవ్ ,పద్మారావు, నరేందర్ బల్ల ,అమిత్, జర్నలిస్టులు ‘కొండా విజయ్ కుమార్, యూ శేఖర్ సాగర్,పుట్టా వినయ్ కుమార్ గౌడ్ ,రాజేష్ గౌడ్ ,మల్లేష్ గౌడ్ ,నాగరత్నం ,శ్రీనివాస్ ముదిరాజ్ ‘ అనిల్ కుమార్ ముదిరాజ్ ‘ మరియు రేవంత్ ముదిరాజు, హన్మంత్, మహేష్ గౌడ్, సాయి గౌడ్, వికాస్ గౌడ్, ప్రశాంత్, మల్లేష్ యాదవ్, కళ్యాణ్, అర్జున్, అజ్మల్,భాస్కర్, భరత్ గౌడ్, చక్రి,నితీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS