SAKSHITHA NEWS

సాక్షిత : – ప్రారంభించిన సైబరాబాద్ శ్రీ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్, ఎమ్మెల్యే కేపి వివేకానంద్

హుషారెత్తించిన సినీ నటులు విశ్వక్ సేన్, అశ్విన్, నటి నందిత శ్వేత…

పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ని జీడిమెట్ల పిఎస్ పరిధిలోని హెచ్ఎంటి గ్రౌండ్ “తెలంగాణ రన్” అట్టహాసంగా జరిగింది. ఈ రన్ కు ముఖ్య అతిథులుగా హాజరైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ , సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర , మేడ్చల్ మల్కాజ్ గిరి అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఐఎఎస్ , జోనల్ కమీషనర్ మమత, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ప్రముఖ సినీ నటులు విశ్వక్ సేన్, అశ్విన్, నటి నందిత శ్వేత తెలంగాణ రన్ లో పాల్గొని హుషారెత్తించారు.

కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన తెలంగాణ రన్ చింతల్ బస్టాప్ మీదుగా ఐడిపిఎల్ నుండి తిగిరి మున్సిపల్ గ్రౌండ్ వరకు సాగిన ఈ 2km రన్ లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిపిలు సందీప్, బాలానగర్ డీసీపీ శ్రీనివాస రావు, ఏసీపీలు చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గంగారాం, రామలింగ రాజు, డిసీలు మంగతాయారు, ప్రశాంతి, మున్సిపాలిటీ కమిషనర్లు శ్రీహరి, రామకృష్ణ రావు, సత్యనారాయణ, సీఐలు పవన్, ప్రశాంత్, క్రాంతి కుమార్, సుమన్, భాస్కర్, వెంకట్ రెడ్డి, నరహరి మరియు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున 2000 మంది వరకు పాల్గొన్నారు.

మాదాపూర్ జోన్ … 1500 మంది పాల్గొన్నారు
చందానగర్‌లోని అపర్ణాహిల్ పార్క్‌లో మియాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్‌లో డిసిపి మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు.
ఖాజాగూడ లేక్ వద్ద నిర్వహించిన 3కె రన్ ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ , కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, డిసిపి మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే గచ్చిబౌలి PS నుంచి బొటానికల్ గార్డెన్‌ వరకు దాదాపు 150 నుండి 200 మంది పాల్గొని జుంబా డ్యాన్స్ మరియు 4k రన్ నిర్వహించారు.
NAC మెయిన్ గేట్ వద్ద పబ్లిక్ / పోలీస్ సిబ్బందితో నిర్వహించిన 3K రన్ లో దాదాపు 110 మంది పాల్గొన్నారు.

IDL చెరువు కట్ట నుండి రెయిన్‌బో విస్టా వరకు 500 మంది తో రన్ నిర్వహించారు. ఈ రన్ లో ముఖ్య అతిథులు గా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
JNTU నుండి మలేషియా టౌన్ షిప్ వరకు 500 మంది తో రన్ నిర్వహించారు. ఈ రన్ లో ముఖ్య అతిథులు గా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

బొటానికల్ గార్డెన్‌లో పబ్లిక్/పోలీసు సిబ్బందితో 4K రన్ నిర్వహించబడింది, దాదాపు 150 నుండి 200 మంది సభ్యులు పాల్గొన్నారు.

బాలానగర్ జోన్ … 1500 మంది పాల్గొన్నారు

బాలానగర్ జోన్ లో కుత్బుల్లాపూర్ నుంచి గుడెన్ మెట్ చౌరస్తా (IDPL) 1500 మంది పాల్గొన్నారు. వీరిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత పాల్గొన్నారు.
రాజేంద్రనగర్ జోన్ … 2000 మంది పాల్గొన్నారు

రాజేంద్రనగర్ జోన్ లో చేవెళ్ళ లో నిర్వహించిన 2K రన్ లో 1000 మంది పాల్గొన్నారు. వీరిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత పాల్గొన్నారు. అలాగే షాబాద్ X చేవెళ్ళ వరకు నిర్వహించిన రన్ లో చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఆర్డిఓ వేణుమాధవ్, రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, ఏడిసిపిలు, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు, యువత సుమారు గా 1000 మంది పాల్గొన్నారు.

రాజేంద్రనగర్ లోని PDP చౌరస్తా నుంచి రాజేంద్రనగర్ అగ్రి కల్చర్ యునివర్సిటి ఎక్స్టెంషన్ వరకు 1000 మంది తో నిర్వహించిన 2K రన్ లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్డిఓ చంద్రకళ, రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, ఏడిసిపిలు, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు, యువత సుమారు గా 1000 మంది పాల్గొన్నారు.

మేడ్చల్ జోన్ … 2000 మంది పాల్గొన్నారు

మేడ్చల్ జోన్ లో నిర్వహించిన 2K రన్ లో 1000 మంది పాల్గొన్నారు. వీరిలో స్థానిక ప్రజాప్రతినిధులు మేడ్చల్ డిసిపి సందీప్, ఏడిసిపిలు, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు, యువత సుమారు గా 1000 మంది పాల్గొన్నారు.

శంషాబాద్ జోన్ … 2000 మంది పాల్గొన్నారు

శంషాబాద్ జోన్ ముఖ్యంగా శంషాబాద్ కోత్తూర్, షాద్ నగర్, అమన్ గల్ నిర్వహించిన 2K రన్ లో 2000 మంది పాల్గొన్నారు.

RGIA PS షాద్ నగర్ మేడ్చల్ జోన్ లో నిర్వహించిన 2K రన్ లో యువత పెద్దఎత్తున పాల్గొన్నారు. వీరిలో స్థానిక ప్రజాప్రతినిధులు, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, శంషాబాద్ డిసిపి నారాయణ్ రెడ్డి, ఏడిసిపిలు, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు, యువత పాల్గొన్నారు.


SAKSHITHA NEWS