ఈ నెల 5న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి.కిరణ్ సంస్మరణ సభ పోస్టర్స్ ను సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రం భవన్ లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఎస్కే . సయ్యద్,ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి వాజిద్ లు మాట్లాడుతూ ఆటో కార్మికుల కోసం కామ్రేడ్ కిరణ్ ఎనలేని సేవలు చేశారని, ఆటోరంగ చరిత్రలోనే చెరగని ముద్ర వేశారని అన్నారు.మోటారు ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిస్వార్ధంగా పోరాటాలు నిర్వహించాడని అన్నారు.సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ హైదరాబాద్ జిల్లా కమిటీ సభ్యులుగా, భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట కమిటీ సభ్యులుగా పేద ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి, హైదరాబాద్ ప్రగతి నగర్ లో పేద ప్రజల కోసం ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేయించి అవి సాధించే పోరాటంలో ముందున్నడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొని జైలు పాలైన వెనకంజ వేయకుండ, ధైర్యంగా ముందుకు సాగినాడని వారు అన్నారు. హైదరాబాదు రంగారెడ్డి సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకులలో మొదటి వాడని అన్నానరు. కార్మికులకు ఎంతో మేలు చేశాడని, కామ్రేడ్ వి.కిరణ్ లేని లోటు తీర్చలేనిదని అన్నారు. కామ్రేడ్ కిరణ్ ఆశయాల సాధన కోసం కార్మికులందరు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈనెల 5వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కిరణ్ అన్న సంస్మరణ సభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నాయకులు పిడమర్తి లింగయ్య, ఐఎఫ్టియు జిల్లా నాయకులు గులాం హుస్సేన్,పద్మ, శ్రీకాంత్,సునిల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రగతిశీల ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వి. కిరణ్ సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరణ : ఐఎఫ్టియు.
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…