తెలంగాణ ఉద్యమ నాయకులు శివనారాయణకు మాజీ మంత్రి నివాళులు.
సాక్షిత వనపర్తి
తెలంగాణ ఉద్యమ నాయకులు డాక్టర్.శివనారాయణ జరిగిన రోడ్ ప్రమాదంలో మరణించారు.
విషయం తెలిసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కిష్టగిరి గ్రామములో వారి స్వగృహంలో శివనారాయణ పార్థీవదేహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నిరంజన్ రెడ్డి వెంట జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, నందిమల్ల.అశోక్,మాణిక్యం,ధర్మా నాయక్,చిట్యాల.రాము బి.ఆర్.ఎస్ నాయకులు ఉన్నారు.
పలువురికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ.
పెద్దమందడి మండలం బలిజేపల్లి, జంగమాయపల్లి,పామ్ రెడ్డిపల్లి గ్రామాలలో నిరంజన్ రెడ్డి ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చి ఆర్థిక సహాయం అందజేసారు.
ఇందులో పానుగంటి.పెంటయ్య,వడ్డే. బాల్ చంద్రయ్య,రాములు, పాతిమా బేగం,చిట్టెమ్మ,రాములు కుటుంబాలను పరామర్శించి ధైర్యం గా ఉండాలని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రఘుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ జయంతి మేడం,శేషివర్ధన్ రెడ్డి, నందిమల్ల.అశోక్, రఘువర్ధన్ రెడ్డి, గోవర్ధన్, సురేష్,సత్యం,నరేష్,కార్తీక్,గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.