SAKSHITHA NEWS

Telangana logo should have charminar and kakatiya arch

శేరి లింగంపల్లి: జూన్ 01: తెలంగాణ “సకలజనుల ఆత్మగౌరవ ప్రతీక మన రాష్ట్ర నాటి రాజముద్ర” నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం దాని వ్యవస్థాపక అధ్యక్షులు తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, రాష్ట్రాన్ని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ రాష్ట్రం వచ్చుడో, అనే నినాదంతో ఢిల్లీ పాలకుల మెడలు వంచి సబ్బండ వర్గాలను తన నాయకత్వ పటిమతో, తన వాగ్దాటితో ఏకం చేసి వందలాదిమంది విద్యార్థి, యువకుల అమరత్వంతో నాడు సాగించిన ఉద్యమ “రణ ” నినాదమునకు తలవంచి తెలంగాణ ఇవ్వడమే శరణ్యం అనేలా చేసిన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకంట్ల చంద్రశేఖర రావు గారు అన్నది జగమెరిగిన సత్యం.
చిహ్నాలను మారిస్తేనో పేర్లను తుడిచివేస్తేనో మాయమయ్యే పేరు కాదు కేసీఆర్ ది .తెలంగాణ సబ్బండ వర్గాల్లో గుండెల్లో రాసుకున్న పేరు కేసీఆర్. రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత స్వరాష్ట్ర పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి రైతును రాజును చేసి మహిళలను మహారాణులను, చేసి
ముసలి తాత అమ్మమ్మలకు భరోసానిస్తూ పెద్ద కొడుకు పాత్రను పోషించిన కేసీఆర్ గారిని వారి ఆనవాళ్లను తుడిచివేసే ప్రయత్నం చేసినంత మాత్రాన అవి చెరిగిపోవు. తెలంగాణ ప్రజల ముందు ఎప్పుడు సజీవ సక్షేలుగా మిగిలిపోతాయి అన్న సత్యం తెలియని ,ఆంధ్ర వలస నాయకుల మోచేతి నీళ్లు తాగి పెరిగిన నేటి ప్రభుత్వ పెద్దలకు ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఈ ప్రాంత చరిత్ర గురించి కనీస అవగాహన లేకపోవడమే పరిపాలనలో ఈ తుగ్లక్ పర్వాన్ని మనం చూడాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఈ ప్రాంతానికి చేయాల్సిన మేలు గురించి ఈ ప్రాంత చరిత్ర దాని ఆనవాళ్లను సైతం పూర్తిగా తెలియజేసిన జ్ఞాన సముద్రం, ఒక గ్రంథం కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.. అందుకే రాష్ట్రం ఏర్పడ్డాక ఉండవలసిన రాజముద్ర పైన కూడా సుదీర్ఘ చర్చ మేధస్సు ,మేధోమధనం చేసి యావత్ తెలంగాణ ముఖచిత్రాన్ని ఆ రాజముద్రలో పొందుపరిచేలా చేశారు చంద్రశేఖర రావు

నాటి రాజముద్ర తీసుకోవడంలో కేసీఆర్ గారి విజ్ఞాన సంపద ఏంటో ఒక విశ్లేషణలో తెలుసుకుందాం. రాజముద్రలో కాకతీయ కళాతోరణం పొందుపరచడంలో ముఖ్యంగా వరంగల్ కోటలో నాలుగు కాకతీయ తోరణాలు సమాన దూరాలలో విస్తరించి దర్శనం ఇస్తాయి. చూడడానికి అలంకార ద్వారాలల కనిపించిన అందులో తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి కేవలం అలంకార తోరణాలు కాదు, కాకతీయ పాలన వైభవం కి నిలువుటద్దం కాకతీయ తోరణం, వారి వైభవాన్ని మొత్తం పూసగుచ్చినట్టుగా అందులో పొందుపరిచినారు వారి యేలు బడిలో వారు ఏ ఏ అంశాలను ప్రాధాన్యత ఇచ్చారో తెలియజేస్తుంది. నిలబడ్డ నాలుగు పిల్లర్లు వాళ్ళ పాలన ల్లో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది అనడానికి నిదర్శనం. చివరి రెండు పిల్లర్ల మీద గర్జించిన సింహాలు కాకతీయులకు ఎదురులేని నాయకత్వానికి చిహ్నం.

దాని పక్కన తల పైకి ఎత్తిన ముసలి అప్పటి జలకళకు ప్రతీతి ,ఎందుకంటే కాకతీయుల కాలంలో చెరువులు కుంటలు, కాలువలలో పుష్కలంగా నీళ్లు ఉండేవి. నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ముసళ్ల మేండుగా ఉంటాయి. ఇక పోతే తోరణం నిండా లతాలు ,తీగలు ,వారి గొలుసు కట్టు చెరువులని, కుంటలని సూచిస్తున్నాయి అపార జలరాశిలో పరవళ్ళు తొక్కడంతో ఆ కాలంలో పంటలు బాగా పండేవి. కాకతీయ పాలనలో ప్రజలకు ఆకలి బాధలు ఎలాంటివో తెలియదు ,అంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే ఇరువైపులా రెండు హంసలు కాకతీయ పారదర్శక పాలనకు నిదర్శనం .. హంస కింద ఇరువైపులా కుబేరుల విగ్రహాలు నాటి ఆర్థిక పుష్టికి చిహ్నం .. కింద భాగాన బోర్లించిన ఏడు పూర్ణ కుంభాలు గ్రామదేవతలకు ప్రతిబింబాలుగా ఉండేవి వాటిని
“సప్త మాతృకలు” అని కూడా పిలుస్తారు. స్తంభం మధ్యలో చేపల బొమ్మలు ఓ వెలుగు వెలిగినటువంటి,మత్స్య సంపదకు మత్స్య పరిశ్రమకు సాంకేతం ఇలా నాటి వారి పాలనలో రాజ్యం ఎలా ఉన్నది అనేది ప్రస్ఫుటంగా కనిపించేలా నిర్మించింది కాకతీయ కళాతోరణం …

అలాంటి సుభిక్ష మైనటువంటి పరిపాలనలో తెచ్చుకున్న నా తెలంగాణలో కూడా ఉండాలని కోరుకున్నటువంటి వారు శ్రీ కల్వ కుంట్ల చంద్రశేఖర రావు గారు, ఇంతటి నిగూడ అర్ధాలు అందులో దాగి ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి
ఈ ప్రాంత అభివృద్ధిని సుదూరంగా ఆలోచించి రాష్ట్ర పురోగతికి చిహ్నంగా కాకతీయ కళాతోరణమును ఉండాలని భావించిన వ్యక్తి కేసీఆర్ గారు.. ఏదైతే చిహ్నంగా తీసుకొని రాజముద్రగా మలిచాడో, అంతే ప్రేమతో యావత్ తెలంగాణలో కరువును పారదోలి , ఫ్లో రోసిస్ ను పారదోలి , వలసలను ఆపి, వ్యవసాయం దండగా అనుకున్నట్టువంటి రైతులకు వ్యవసాయం పండగ అని తెలియజేసేలా బీడు బారినటువంటి భూముల దాహార్తిని తీర్చినటువంటి అపార భగీరథుడు కెసిఆర్ …అందుకె , K – అంటేనే కాలువలు, C -అంటేనే చెరువులు, R – అంటేనే రిజర్వాయర్లు అనేలా తాను ఎంచుకున్నటువంటి కళాతరుణంలోని అంశాలను ప్రతిబింబించేలా తన పాలలను సుభిక్షం చేసింది కేసీఆర్ ,అన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది..

ఇకపోతే నేటి ప్రభుత్వం విషయానికి వద్దాం నేటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళాతోరణం తీసి అమరల స్థూపాన్ని ఉంచారు. రాష్ట్ర అమరుల త్యాగాల ఫలం కాబట్టే చిహ్నాన్ని మార్చామంటున్నారు. ఏ రాజముద్ర అయినా రాష్ట్ర పరిస్థితులను ప్రతిబింబించే అభివృద్ధి సూచికలను రాజముద్రంలో ఉంచాలి. అమరుల త్యాగం ఈరోజు కైనా కీర్తించదగినదే కానీ రాజముద్రంలో పొందుపరచాల్సిన అవసరం లేదు. యూనిటీ ఆఫ్ డైవర్సిటీ అన్ని వర్గాల ఆమోదయోగ్యంగా ఉండాలి. రాజముద్ర అనేది ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి పచ్చటి తోరణం రాజముద్రలో వైభవాన్ని చాటేలా ఉండాలి, సమైక్యతను చాటేలా ఉండాలి, భిన్న సంస్కృతల సమ్మేళనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆ మాటకొస్తే అసలు అమరుల పేరుగాని వారి త్యాగాలను గాని పలికే అర్హత కాంగ్రెస్ కి లేదనే నేను భావిస్తాను. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరుల అవ్వడానికి కారణమైన పార్టీ కాంగ్రెస్ కాదా ఎట్లుంది అంటే చంపినోడే పూలదండ వేసి నివాళులర్పిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది …

1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని పోరాటం చేస్తున్నటువంటి సిటీ కాలేజ్ విద్యార్థుల పైన కాల్పులు జరిపి సుమారు 6 మందిని పోట్టన పెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ,1969 – 71 వ సంవత్సరంలో ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్, 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లకి 11 సీట్లలో గెలిచినటువంటి తెలంగాణ ప్రజా సమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? 2004లో మాట ఇచ్చి తస్సారం చేసి వందలాదిమంది విద్యార్థి ,యువకులను పొట్టను పెట్టుకుంన్న పార్టీ రాజముద్రంలో ప్రజలను అమరులను చేసినటువంటి పార్టీ, ఈరోజు రాజముద్రంలో అమరుల స్తూపం పెట్టి నివాళులర్పిస్తుంటే నోరెళ్లబెట్టి చూస్తున్నది నా తెలంగాణ

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రం కోసం అమరులైనటువంటి స్వతంత్ర సమరయోధుల చిహ్నాన్ని భారత ప్రభుత్వ చిహ్నంగా ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్?
అశోకుడు స్థాపించినటువంటి సారానాదులోని స్థూపం నుండి స్వీకరించిన నాలుగు సింహాలు ,అశోక చక్రాన్ని, కలువ పువ్వుని ,దాని కింద దేవనాగరి లిపి లో రాయబడినటువంటి సత్యమేవ జయతే దాని కింద నాలుగు జంతువు బొమ్మలు ఎడమ నుండి కుడికి ఏనుగు, గుర్రము, ఎద్దు, సింహము బొమ్మలతో కూడినటువంటి చిహ్నాన్ని ఎంచుకున్నారు ఎందుకు స్వతంత్ర సమరయోధుల చిహ్నాలను పొందుపరచలేదు కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది

ఈ ప్రాంతం బిడ్డలు ఉద్యమ ఉగ్గుపాలు తాగిన బిడ్డలు, సమ్మక్క సారక్క, రాని రుద్రమదేవిల పోరాటాన్ని ,సర్వాయి పాపన్న, విప్లవ కవి అయినటువంటి దాశరధుల వారసత్వాన్ని, గుదుపలతోని నాటి అరాచక శక్తులను ఎదురోడ్డు పోరాడినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి బిడ్డలం. కాంగ్రెస్ చేసేటువంటి అరాచక పాలనలో త్వరలోనే ఈ యొక్క ప్రాంతం అస్తిత్వ ఉద్యమాలను చేయవలసివస్తుందేమో అనేటువంటి విధంగా గుర్తు చేస్తున్నది. ఇప్పటికైనా వీటన్నిటిని గుర్తెరిగి పరిపాలన సాగించుకుంటే మంచిదని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలుకుతుంది. …
సత్యమేవ జయతే ,… జై తెలంగాణ….

ఇట్లు
డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
MA ,MTM ,Ph.D
88866 66006
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app


SAKSHITHA NEWS