Telangana Govt stands firm for girl child: Vikarabad MLA
ఆడబిడ్డల పక్షాన కొండంత అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.59,06,844/- (రూపాయలు యాభై తొమ్మిది లక్షల ఆరువేల ఎనిమిది వందల నలభై నాలుగు) విలువ గల 59 కళ్యాణలక్ష్మి / షాదిముబారక్ చెక్కులను అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండగా నిలుస్తూ… ప్రతి దశలో ఆడబిడ్డలకు తోడుగా సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.