సాక్షిత : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన నాయకులు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీని వీడి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మద్దతు
సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, పులికొల్లు, వెంకటాపురం గ్రామాలకు చెందిన తెలుగుదేశం ప్రధాన నాయకులు కొరపాటి రంగయ్య నాయుడు, కొమ్మి శ్రీనివాసులు నాయుడు, గుంజి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీని వీడి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.