
టీడీపీ కుటుంబ సభ్యుని మృతి.
పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, .
మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బేతపూడి చిన్న నరసయ్య మేనల్లుడు బురదగుంట చందు (23) ఇటీవల మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు , జి.కొండూరు గ్రామంలోని వారి నివాసానికి విచ్చేసి చందు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పుష్పములు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app