సాక్షిత : నెల్లూరు పార్లమెంటరీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పరిచయం
ఎవరొచ్చినా భయపడం ఇది నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రక్తం
జగన్మోహన్ రెడ్డి తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి
కోవూరు మండలంలోని రుక్మిణి కల్యాణ మండపంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయి రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సాధారణంగా ఆహ్వానించి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు సమక్షంలోపరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు, అనంతరం “ఎమ్మెల్యే ప్రసన్న” మాట్లాడుతూ,ముందుగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు నలుగురు ఉండేవాళ్లు విజయసాయిరెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక ఆయన ఈ నలుగురు కూడా నేరుగా ఇంట్లోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూర్చొని రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల మీద సంక్షేమ పథకాలు మీద అన్ని కార్యక్రమాల మీద మాట్లాడేవారు, ఒకాయన బయటికి వచ్చేసారు ఇప్పుడు ఎక్కడున్నాడు గేటు బయట ఉన్నారు ఒకరి ద్వారా లబ్ది పొంది ఒకరి ద్వారా పదవులు పొందినప్పుడు నిజాయితీగా ఉండాలి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఒక మైనార్టీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోయాడు పేదవాళ్లు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కాకూడదా డబ్బున్న వాళ్ళే అవ్వాలా జగన్ మోహన్ రెడ్డికి నమ్మకద్రోహం చేశాడు మనకు విజయసాయిరెడ్డిని ఎంపీ అభివృద్ధి గా నిలబెట్టగానే అవతలోలకి గుండెల్లో రైళ్లు పెరగడుతున్నాయి ఇంకొకటి ధైర్యంగా ఉండండి టాటా బిర్లాలు వచ్చిన అంబానీ వచ్చిన ముఖేష్ అంబానీ వచ్చిన ఎవరొచ్చినా ప్రసన్న కుమార్ రెడ్డి భయపడడు ఇది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం ఎవరు వచ్చినా సిద్ధం
అనంతరం పార్లమెంటరీ అభ్యర్థి రాజ్యసభ సభ్యులు “విజయసాయిరెడ్డి” మాట్లాడుతూ నేను నిన్న ఆ నెల్లూరు జిల్లాలో ప్రవేశించినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నాకు ఇచ్చినటువంటి స్వాగతం బాగుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ కి పోటీ చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన తర్వాత ఇంకా రాజ్యసభలో సమయం ఉన్నప్పటికీ కూడా ఈ నెల్లూరు జిల్లా నేను పుట్టినరోజు ఒంటిగడ్డ ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే విద్యాభ్యాసం చేశాను నాకు ఇక్కడ నుంచి పోటీ చేయడం చాలా సంతోషం ఇచ్చింది పుట్టిన గంటకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషం ఆ బాధ్యత నెరవేర్చడానికి కూడా నాలో పట్టుదల పెరుగుతూ ఉంది ప్రసన్న అన్న మిమ్మల్ని తృప్తి పరచడం జరిగింది నేను కూడా తృప్తికరంగా సేవలందిస్తానని ఈ సభ ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ హామీ ఇస్తున్నాను కోవూరు గడ్డ చరిత్ర ఉండే గడ్డ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని ఇంతగా ఆదరిస్తున్నారు ఆయన నాన్న నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుంచి రాజకీయాల్లో ఉన్నారు 2019లో ప్రసన్న అన్నకి 40 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు. 2024లో 50వేల మెజార్టీ ఇవ్వాలి. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది ఆయనకి 50,వేల మెజార్టీ వస్తే నాకు 50,వేల మెజార్టీతో ముందుంటానని తెలియజేశారు నెల్లూరు జిల్లాకి అన్ని వనరులు ఉన్నాయి కానీ లేనటువంటిది విమానాశ్రయం ఎందుకనో ఈ విమానాశ్రయం లేటవుతుంది ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి ఉద్దేశంతో దగదర్తి దగ్గర ఉండే ప్రదేశంలో దీన్ని తీసుకురావడానికి నా సాయి శక్తుల కృషి చేస్తానని తెలియజేశారు…ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వైయస్సార్ పార్టీ అధ్యక్షులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, కోవూరునియోజకవర్గపు యువత అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నియోజకవర్గపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.