SAKSHITHA NEWS

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ మేరకు ఉదయం కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమక్షంలో ఆమె తిరిగి బీజేపీలో చేరారు . తమిళిసైకి కిషన్‌ రెడ్డి కమలం కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు.కాగా, దాదాపు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న తమిళిసై.. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమెను కేంద్రం తెలంగాణకు గవర్నర్‌గా నియమించింది. 2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రత్యక్ష రాజకీయాలంటే ఇష్టమున్న ఆమె.. లోక్‌సభ ఎన్నికలకు ముందు గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి బీజేపీలో చేరారు. త‌మిళ‌నాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి ఎంపీ స్థానం నుంచి త‌మిళిసై పోటీ చేసే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది

WhatsApp Image 2024 03 20 at 12.47.07 PM

SAKSHITHA NEWS