SAKSHITHA NEWS
Tamil MP who took oath in Telugu

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళ ఎంపీ

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళ ఎంపీ
తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాధ్ లోక్‌సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు కుటుంబానికి చెందిన గోపీనాధ్ తన పూర్వీకులు తమిళనాడులోని హోసూరులో స్థిరపడడంతో తెలుగునే మాతృభాషగా భావిస్తున్నారు. దీంతో గతంలో కూడా (2001, 2006, 2011) ఎమ్మెల్యేగా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తొలిసారి కృష్ణగిరి నుంచి ఎంపీగా గెలవడంతో తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకుని ప్రమాణ స్వీకారం చేశారు.