Taking charge at Shastri Bhavan, Delhi
ఢిల్లీలోని శాస్త్రి భవన్లో బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ, : దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని, ఖనిజాలను వెలికి తీసేందుకు కృషి చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఢిల్లీలోని శాస్ర్తి భవన్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో పదేళ్ల క్రితం విద్యుత్ కొరత ఉండేదని, గడిచిన పదేళ్లలో ప్రధాని మోదీ ఆ సమస్యకు చెక్ పెట్టారని తెలిపారు. దీనికి ప్రధాన కారణం బొగ్గు ఉత్పత్తి పెరగడమేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎంతో నమ్మకంతో రెండు శాఖలు అప్పగించారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, సతీశ్ చంద్ర దూబే, బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు.