డ్యూటీలో ఉన్న ఉద్యోగులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
సాక్షిత శంకరపల్లి : డ్యూటీలో ఉన్న ఉద్యోగులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండని వార్డు ఆఫీసర్లు ప్రభుత్వాన్ని కోరారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న మామిండ్ల జయరాం పై 25వ తేదీ శుక్రవారం స్థానిక చైర్ పర్సన్ భర్త పొగాకు విశ్వేశ్వర్ దాడి చేశారు. వార్డు ఆఫీసర్ పై దాడి చేసిన చైర్ పర్సన్ భర్త పై చర్యలు తీసుకోవాలని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.