గచ్చిబౌలి ట్రాఫిక్ PS, సైబరాబాద్ పరిధిలో గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రహదారి వైపు ఫ్లైఓవర్ పని కోసం ట్రాఫిక్ మళ్లింపు. GHMC శిల్పా లేఅవుట్ ఫేజ్-II ఫ్లై ఓవర్ పనిని గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రోడ్డు వరకు (90) రోజుల పాటు అంటే 13.05.2023 నుండి 10.08.2023 వరకు పని చేస్తారు . ఈ నేపథ్యంలో కింది మార్గాల్లో వాహనాలను దారి మళ్లించడం జరుగుతుంది . ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని సూచించడమైనది. ఈ సంధర్బంగా మీడియా వారిని వివిధ మార్గాలలో మళ్లించబడిన ట్రాఫిక్ పైన అవగాహహన కోసం మీడియా వారిని అలాగే GHMC అదికారులను బస్సులో తీసుకొని వెళ్ళి, ట్రాఫిక్ కోసం ఏర్పాటు చేయబడిన ప్రతి మార్గాన్ని అలాగే diversion ను సందర్శించడం జరిగినది. పై పనిని సులభతరం చేయడానికి క్రింది ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక చేయబడింది:- 1.ORR నుండి హఫీజ్‌పేట వైపు వచ్చే ట్రాఫిక్ ను గచ్చిబౌలి జంక్షన్ ద్వారా మళ్లించి శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా – మీనాక్షి టవర్స్ – డెలాయిట్ -AIG హాస్పిటల్ – క్యూ మార్ట్ – కొత్తగూడ ఫ్లైఓవర్– హాఫీజ్పేట్ వెళ్లేవిధంగా ఏర్పాటు…