మహిళకు మెరుగైన భద్రత కోసం వారి ప్రయాణ పర్యవేక్షణ సేవల కోరకు T safe సేవలను ను అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్
ఎలాంటి మొబైల్స్ ద్వారా అయిన మహిళలు ప్రయాణించే సమయంలో T Safe సర్వీస్ ద్వారా ప్రయాణ సమయం లో పోలీస్ భద్రతా పొందవచ్చు
మహిళలకు మెరుగైన భద్రతను కల్పించడం లో భాగంగా వారు ప్రయాణించే సమయంలో ప్రయాణ పర్యవేక్షణ సేవలు పొందేందుకు దేశం లో తొలి సారిగా తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ విభాగం అందుబాటులోకి తీసుకువచ్చిన T- SAFE సర్వీస్ ల ను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్,IPS జిల్లా మహిళలకు సూచించారు.
రాష్ట్రం లో మహిళల భద్రత కోరకు తొలి ప్రాధాన్యతను ఇస్తూ పోలీస్ శాఖ తీసుకుంటున్న అనేక చర్యలతో పాటు వారికి మరింత మెరుగైన భద్రతను కల్పించేందుకు వారు ప్రయాణించే సమయంలో ప్రయాణ పర్యవేక్షణ సేవలను వారికి అందించేందుకు T – SAFE సర్వీస్ సేవలను పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ అందుబాటులోకి తేవడం జరిగింది .
మహిళలు ప్రయాణించే దూరాన్ని ఈ T safe మానిటర్ చేస్తుంది, అన్ని రకాల మొబైల్ ఫోన్ లకు అనుకూలంగా T Safe సర్వీస్ సేవలు ఉంటాయి. కావున మహిళలు ప్రయాణించే సమయంలో T safe ద్వారా పోలీస్ భద్రతను పొందగలరు.
సాధారణ మొబైల్స్/డయల్ -100 ద్వారా T safe సేవలు పొందే విధానం
మహిళలు తాము ప్రయాణించే సమయంలో అభద్రతకు గురయ్యే అవకాశం ఉందని భావించినప్పుడు తమ ప్రయాణం పై పోలీస్ పర్యవేక్షణ ఉండాలనుకున్నప్పుడు డయల్ -100 కు కాల్ చేస్తే అత్యవసర సహాయం కోసం నం 1 నొక్కమంటుంది లేదా ప్రయాణ పర్యవేక్షణకు అయితే నం 8 ను నొక్కమంటుంది. ప్రయాణ పర్యవేక్షణ కోరకు 8 నొక్కితే వెంటనే నాలుగు డిజిట్స్ నం పాస్వర్డ్ ఎంట్రీ చేయమని ఆడుగుతుంది. నాలుగు డిజిట్స్ నంబర్ నొక్కగానే వారి ఫోన్ T Safe కు కనెక్ట్ అయి వారి ప్రయాణం పర్యవేక్షించడం జరుగుతుంది. తరవాత ప్రతి 15 నిమిషాలకు ఒక సారి సంబంధిత ఫోన్ కు అలర్ట్ కాల్స్ వస్తాయి.వారు రెస్పాన్స్ అయి రీప్లే ఇస్తే సరే ఒక వేళ వారు రెస్పాన్స్ కాక పోయినా లేదా సురక్షితంగా ఉన్నారా అనీ వచ్చిన కాల్స్ కు సురక్షితంగా లేము అనీ రీప్లే ఇచ్చిన పోలీస్ అధికారులు డయల్ – 100 ద్వారా అప్రమత్తం చేసి సంబంధిత లొకేషన్ కు అక్కడి లోకల్ పోలీస్ అధికారులను పంపడం జరుగుతుంది.
స్మార్ట్ ఫోన్స్ లలో T-SAFE App డౌన్లోడ్ చేసుకునే విధానం
స్మార్ట్ ఫోన్స్ లోని ప్లే స్టోర్ లోకి వెళ్లి ట్రావెల్ సేఫ్ తెలంగాణ అని టైప్ చేస్తే T SAFE కనిపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకొని నోటిఫికేషన్స్ ను ఓకే చేసి మొబైల్ నం రిజిస్టర్ చేసి , పేరు ఇతర వివరాలు నమోదు చేసి సైన్ అప్ ఆప్షన్ నొక్కితే Otp వస్తుంది. Otp ఎంట్రీ చేస్తే డీటైల్స్ వెరిఫై చేసి అప్డేట్ చేస్తే మీ ఫోన్ లో App రడి అవుతుంది.
వినియోగించే విధానం
మహిళలు తమ ప్రయాణం లో అభద్రతకు గురై తమ ప్రయాణం పై పోలీస్ పర్యవేక్షణ కావాలనుకున్నప్పుడు
మొబైల్ లో T Safe App ను ఓపెన్ చేసి మానిటరింగ్ సర్వీస్ లోకి వెళ్తే స్టార్ట్ మానిటరింగ్ బటన్ వస్తుంది/ కనిపిస్తుంది, ఆ బటన్ ను క్లిక్ చేస్తే ఎక్కడి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాము, ఏ వెహికల్ లో వెళుతున్నాను, వెహికల్ నం లు నమోదు చేసి స్టార్ట్ ఆప్షన్ ను నొక్కగానే 4 డిజీట్స్ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంట్రి చేయగానే ట్రిప్ పర్యవేక్షణ ఆక్టివ్ అవుతుంది . తరవాత ప్రతి 15 నిమిషాలకు ఒక సారి, వాహనం వెళ్ళవలసిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్ళిన, ఎక్కువ సేపు ఓకే చోట అగిన వెంట వెంటనే అలర్ట్ నోటిఫికేషన్ లు వస్తాయి వాటికి రీప్లే ఇవ్వాల్సి ఉంటుంది. రీప్లే ఇవ్వక పోయినా లేదా సురక్షితంగా ఉన్నారా అనీ వచ్చిన నోటిఫికేషన్ కు సురక్షితంగా లేము అనీ రీప్లే ఇచ్చిన పోలీస్ అధికారులు డయల్ -100 ద్వారా అప్రమత్తం చేసి సంబంధిత లొకేషన్ కు అక్కడి లోకల్ పోలీస్ అధికారులను పంపడం జరుగుతుంది.
అలగే ఇదే app లో అత్యవసర సమయంలో ఉపయోగించాల్సిన డయల్ – 100 ఆప్షన్ కూడ ఉంటుంది.
ఈ App ను ఉపయోగించడం ద్వారా ఏలాంటి వ్యక్తిగత సమచారం బహిర్గతం అవదు మరియు వారి వ్యక్తి గత సమచారం రహస్యంగా ఉంచబడుతుంది కావున మహిళలు ప్రయాణ సమయంలో అభద్రతకు గురైనప్పుడు, మహిళలు ఒంటరిగ ప్రయాణం చేసే సమయంలో T Safe సేవలను వినియోగించుకోనీ పోలీస్ భద్రతను పొందగలరు.