భూదేవి హిల్స్ భూముల సర్వే చెయ్యించండి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
గాజులరామారం రెవిన్యూ పరిది భూదేవిహిల్స్ లో ప్రభుత్వ,ప్రైవేట్ భూములు ఓవర్లాపింగ్ సమస్య ఉందని దానిని అసారా చేసుకొని భూకబ్జాదారులు ప్రభుత్వ భూమిని కూడా తన భూమే అని చెప్పి ప్లాట్లుగా చేసి సుమరు 15 నుండి 20లక్షలకు అమ్ముతు ప్రజలను మోసం చేస్తున్నారని కావున వెంటనే సర్వే నిర్వహించి ఎంత ప్రభుత్వ భూమి,ప్రైవేట్ భూమి ఉందొ తేల్చాలని నేడు కలెక్టరేట్లో ప్రజావాణి సందర్బంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా వరు మాట్లాడుతూ 2018లొ కోర్టు సర్వే చెయ్యాలని ఆదేశాలు ఇచ్చినప్పటికి నేటికీ కూడా సర్వే చెయ్యకపోవడం అధికారుల పనితీరు ఎలా ఉందొ తెలియచేస్తుందని,అధికారుల నిర్లక్ష్యానికి కారణం అలసత్వమా లేక భూకబ్జాదారులతో ఏమైనా లాలూచి పడ్డారా అని ఆలోచించాల్సి వస్తుందని వెంటనే సర్వే చెయ్యకపోతే అదే కోర్టుకు అధికారులను పిలిపించాల్సి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి గారు వెంటనే డీ ఐ ని పిలిపించి సర్వే కోసం ఏర్పాట్లు చేసుకొని హద్దులు తేల్చాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్ పాల్గొనడం జరిగింది.