SAKSHITHA NEWS

విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు

విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈ 3 కాంప్లెక్స్ నందు ఈట్ స్ట్రీట్ లోని ఫుడ్ జైల్ పంజాబీ తడఖా ఆల్ఫా అరేబియన్ ఫుడ్ తదితర రెస్టారెంట్ లపై ఆకస్మికంగా నేడు ఉమ్మడి కృష్ణాజిల్లా అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహోద్దీన్
నేత్రుత్వంలో దాడులు నిర్వహించారు. పదివేల రూపాయల విలువగల సుమారు 20 కేజీలు పైగా నిల్వ ఉన్న మాంసహారాన్ని, శాఖహారాన్ని గుర్తించినట్లు తెలిపారు. అనంతరం బిర్యానీ రైస్ శాంపిల్స్ సేకరించారు. సీజ్ చేసిన మొత్తం ఆహారాన్ని ఫినాయిల్ ద్వారా పూర్తిగా ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణాజిల్లా అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహోద్దీన్ మాట్లాడుతూ హోటల్స్ రెస్టారెంట్లను, ఆహార పదార్థాలు తయారు చేసే పరిశ్రమలు కూడా లైసెన్స్ పొంది, ఫుడ్ సేఫ్టీ వారు విధించిన నియమ నిబంధనలు కనుగొనంగానే ఆహార పదార్థాలను విక్రయించాలని తెలిపారు. లేనియెడల కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని కావున హోటల్ నిర్వాహకులు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్

WhatsApp Image 2024 07 31 at 10.02.21

SAKSHITHA NEWS