హైదరాబాద్:
ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని, దేవుని ముందు స్త్రీ పురుషు లందరూ సమాన మేనని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది.
శని శింగనాపూర్, హాజీ అలీ దర్గా, శబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పుల పరంపరలో రాష్ట్ర హైకోర్టు ముస్లిం మహిళలకు సంబం ధించి ఓ సంచలన తీర్పు వెలువరించింది.
మసీదులు, జషన్‌లతో పాటు ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతిం చాలని వక్ఫ్ బోర్డును ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
మహిళలు పురుషులకంటే ఏమాత్రం తక్కువ కాదని అభిప్రాయపడింది.పురు షుడికంటే స్త్రీ ఎలా తక్కువ అవుతుందని ప్రశ్నించింది. దేవుని ముందు స్త్రీ పురు షులందరూ సమానులేనని, దేవునికి లింగ వివక్ష ఉండ దని స్పష్టంచేసింది.
పురుషుడి కంటే స్త్రీ తక్కువ అని భావిస్తే..జన్మనిచ్చిన తల్లి కూడా మహిళేనని, తల్లి మనకంటే తక్కువ ఎలా అవుతుందని కోర్టు నిలదీసింది. నిర్దిష్టమైన కొద్దిరోజులు మినహా మహి ళలు నిరభ్యంతరంగా ప్రార్థనాస్థలాల్లోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ నగేశ్ భీమ పాక సోమవారం మధ్యం తరఉత్తర్వులు జారీచేశారు.