SAKSHITHA NEWS

భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా దేవుని ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చిన ఓ ఆటోను పోలీసులు తనిఖీ చేయగా అందులో ప్యాకెట్లలో ఉన్న 484 కిలోల గంజాయి వారి కంటబడింది. ముగ్గురు వ్యక్తులు ఓ ఆటోను కొని దాన్ని దేవుడి ప్రచార రథంలా మార్చి వారే స్వామీజీగా భక్తులుగా మారి గంజాయి సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సరిహద్దుల్లోని కలిమెల పరిసర ప్రాంతాల్లో బుజ్జి అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి తమ ప్రాంతానికి తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుపడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోతో పాటు, గంజాయిని రెండు చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.1.21 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు..

WhatsApp Image 2023 12 12 at 3.26.33 PM

SAKSHITHA NEWS