SAKSHITHA NEWS

తలకొండపల్లి మండలంలోని పడమటి తండా గ్రామపంచాయితీ పరిధిలోని తాళ్ళగుట్టతండా లో హనుమాన్ జయంతి సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యేక పూజ లో పాల్గొని తండా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అదేవిధంగా గత నెలలో గ్రామం లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు సేవాలాల్ గుడి నిర్మాణానికి మొదటి విడతగా ఒక లక్ష యాభై వేల (1,50,000) రూపాయలు ఆలయకమిటీ సభ్యులకు అందజేశారు.అర్ధాంతరంగా మధ్యలోనే నిలిచిపోయిన మా గుడి పునర్ నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి రాఘవేందర్ రెడ్డి కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుల్యాణాయక్, తార్య, వార్డ్ మెంబర్ రఘు, రామునాయక్, వాల్య, గోపాల్, హరి ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS