suicide prevention training is provided in Srikakulam Green City
ఆత్మహత్య నివారణకు శిక్షణ ఇచ్చిన శ్రీకాకుళం గ్రీన్‌సిటీ
జే సి ఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ స్వచ్ఛoధ సంస్థలయిన చేయూత,ప్రాణధాత
చిక్కోలు యువశక్తిలతో కలసి
ప్రీవెన్షన్ సూసయిడ్ మెగా సెమినార్ స్థానిక సన్ స్కూల్ లో నిర్వహించారు.
శ్రీకాకుళం: జేసిఐ గ్రీన్ సిటీ సాయిబాబా అధ్యక్షలు ఆధ్వర్యంలో లో నిర్వహించిన కార్యక్రమంలో జోన్ ట్రైనర్ Senator మధుబాబు విద్యార్థులకు ఆత్మ హత్య నివారణ కు తగు సూచనలు చేస్తూ శిక్షణ ను ఇచ్చారు.విద్యార్థులు ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ తో పాటు బుద్ధి బలం తో ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ మంచి పనులకు శ్రీ కారం చుడుతూ,మంచి స్నేహితులును కలిగి వుంటే ఎటువంటి డిప్రెషన్ మీ జోలికి రాదని విద్యార్థులకు శిక్షణ ను ఇచ్చారు.ఈ సందర్భంగా
ప్రావిజనల్ జోన్ ట్రైనర్
రిషితా మాటలాడుతూ చదువు పై ఏకాగ్రత ను ఉంచాలని మీరు ఇంజనీరు గా,డాక్టర్ గా,కలెక్టర్ గా భారతదేశంలో ఉన్నత స్థితి లో వుండి దేశానికి సేవ చేయాలే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు లోను కాకూడదు అని శిక్షణ ను ఇస్తూ పిల్లల్లో ఉత్సాహం ను నింపారు.మనీ శర్మ మాట్లాడుతూ మానవ జన్మ కు ఎంతో ప్రాధాన్యత ఉందని,జీవితంలో బ్రతికి తేనే ఏదైనా సాధిస్తామనీ బ్రతికి లక్ష్యం సాధించాలని అన్నారు.
కార్యక్రమంలో యోగీస్వర రావు,చేయూత అధ్యక్షులు వెంకట లక్ష్మి. శ్రావన్, వాడ సాయి, స్కూల్ ప్రిన్సిపాల్ ఇందిరా,టీచర్లు పాల్గొన్నారు.