SAKSHITHA NEWS

కట్టుదిట్టమైన భారీ బందోబస్తు నడుమ విజయవంతంగా ముగిసిన రాష్ట్రపతి పర్యటన.

సమర్థవంతమైన విధినిర్వహణను కనపరిచిన ప్రతి ఒక్క పోలీస్ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఐపిఎస్ .

ప్రజా జీవనానికి, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రశాంత వాతావరణంలో రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేసిన కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం

మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో ఎలాంటి అంతరాయం కలగకుండా పటిష్ట భద్రతను అందజేసి విజయవంతంగా బందోబస్తు ముగించినందుకు పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమం కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం నడుమ పటిష్ట బందోబస్తు నిర్వహించి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయడమైనది.
రాష్ట్రపతి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారులను సిబ్బందిని, ఇతర జిల్లాలయిన (కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ,గుంటూరు, ఎన్టీఆర్ , అన్ని జిల్లాల బీడీ టీం సిబ్బంది) నుండి బందోబస్తు విధులు నిర్వహించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.అందరి సమిష్టి కృషి కారణంగానే విజయవంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, ప్రశాంత వాతావరణంలో బందోబస్తు నిర్వహించగలిగామని ఎస్పీ తెలిపారు

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నందు ప్రారంభించబడిన కార్యక్రమం, మంగళగిరిలో ముగించుకుని తిరిగి మళ్ళీ విమానాశ్రయాన్ని చేరుకొని తిరుగు ప్రయాణం అయ్యేంతవరకు ప్రతి ఒక్క సిబ్బంది ఎంతో నిబద్దతగా విధులు నిర్వర్తించారు.

రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలనే లక్ష్యం ఒకవైపు, అదే సమయంలో ప్రజా జీవనానికి ప్రజా రవాణా కి అంతరాయం కలగకుండా చూడటం మరొకవైపు రెంటిని సమిష్టిగా విధులు నిర్వర్తించి విజయవంతమయ్యారు. త్రోపులాటతో ప్రజలు ఎవరు కాన్వాయ్ కి ఎదురు రాకుండా అకారణంగా వాహనాలు అడ్డం పడకుండా ట్రాఫిక్ రెగ్యులేటింగ్ చేయడంలో విజయవంతమయ్యారు.

సమయపాలన పాటిస్తూ ప్రజలందరినీ కంట్రోల్ చేసి కాన్వాయ్ వెళ్ళడానికి సహకరించిన పోలీస్ అధికారులకు సిబ్బందికి అభినందనలు.

శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. రోప్ పార్టీ, రూఫ్ టాప్ బందోబస్తు, 14 సెక్టార్లలో విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్క సిబ్బంది ఎంతో చురుకుగా విధులు నిర్వర్తించారు.

ఏ చిన్న రిమార్కు లేకుండా విదులు నిర్వర్తించిన ప్రతి ఒక్క సిబ్బంది యొక్క పనితీరు అభినందనీయం.

స్థాయి భేదం లేకుండా హోంగార్డు స్థాయి నుండి పై అధికారి వరకు అందరూ సమిష్టిగా కృషిచేసి రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ యొక్క ప్రతిష్ట మరింత పెరిగింది దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు. ఇకపై ఇలాంటి కార్యక్రమాలు అన్నిటిని ఇదే స్ఫూర్తితో విజయవంతం చేద్దామని ఎస్పీ తెలిపారు.

అనంతరం రాష్ట్రపతి పర్యటన ముగించుకొని తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని తిరుగు ప్రయాణంలో ఎస్పీ వందనం సమర్పించి వీడ్కోలు పలికారు.


SAKSHITHA NEWS