SAKSHITHA NEWS

రాష్ట్రవ్యాప్తంగా 2 నవంబర్ 2024 నుండి 1 డిసెంబర్ 2024 వరకు వైభవోపేతంగా కార్తీకమాస దీపోత్సవ వేడుకల నిర్వహణ

  • దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు

కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరివేసేలా దేవాదాయ శాఖ నేటి నుండి ‘సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు’ వైభవోపేతంగా నిర్వహిస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ప్రకటించారు. 2 నవంబర్ 2024 నుండి 1 డిసంబర్ 2024 వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో కార్తీకమాస దీపోత్సవ వేడుకలను కన్నులపండువగా నిర్వహించేలా కార్యనిర్వహణాధికారులు, అసిస్టెంట్ కమిషనర్లకు మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు అన్ని దేవాలయాల్లో కార్తీక దీపోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. సామూహిక కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు రెండు మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితంగా అందించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ ఈవోలను నిర్దేశించారు.

ఇతర అంశాలు:

  • కార్తీక మాస దీపోత్సవ వేడుకలకు హాజరయ్యే మహిళా భక్తులకు ఉచితంగా పసుపు కుంకుమ అందిస్తారు
  • ప్రధాన దేవాలయాల్లో మహిళా భక్తులకు బ్లౌజ్ పీస్ ల అందజేత
  • ప్రతిరోజు సాయంత్రం సామూహిక దీపోత్సవ సమయంలో ప్రత్యేక ప్రసాద పంపిణీ
  • సంబంధిత దేవాలయానికి చెందిన నిధులు, దాతల సహకారం ద్వారా ఇతర కార్యక్రమాల నిర్వహణ
  • ప్రతిరోజు సాయంత్రం స్థానిక కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
  • కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజులను పురస్కరించుకుని మొత్తంగా కార్తీక మాసంలో ఐదు రోజులపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. స్థానిక కళాకారులతో పాటు, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రముఖ కళాకారులతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రవచనాలు, భజనలు, కీర్తనలు, భక్తి పాటలు, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యాలు, బుర్రకథ, హరికథ తదితర కార్యక్రమాలను దేవాదాయ శాఖ చేపడుతుంది.
  • కార్తీకదీపాలను వదిలేందుకు నీటి కొలనుల ఏర్పాటు
  • భక్తి ఛానల్, ఎఫ్ఎం రేడియో తదితర సమాచార సాధనాల ద్వారా కార్తీక మాస దీపోత్సవ వేడుకల ప్రచారం
  • అవకాశమున్నచోట ప్రత్యేక ‘నది హారతి’ కార్యక్రమాల నిర్వహణ
  • టీజీ ఆర్టీసీ సహకారంతో ప్రత్యేక రవాణా సదుపాయ కల్పన
  • కార్తీక మాస దీపోత్సవ వేడుకల నిర్వహణ సందర్భంగా అభిషేకాలు, హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటి ప్రత్యేక పూజల నిర్వహణ కార్తీక మాస దీపోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు కార్తీక సోమవారాల్లో ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్తీక మాసం మొదటి సోమవారమైన 4 నవంబర్ 2024 న కీసర లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సాయంత్రం నిర్వహించే కార్తీక మాస దీపోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
WhatsApp Image 2024 10 18 at 4.06.30 PM

SAKSHITHA NEWS