SAKSHITHA NEWS

సబ్‌స్టేషన్ స్థల పరిశీలన

*సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంబిపూర్, మల్లంపేట్ మరియు బౌరంపేట్ గ్రామంలో 3 -ఫేస్ కరెంటు ఒడిదుడుకులు మరియు కరెంటు రాకపోవడంతో గత నెల కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి కె .వి ఆర్ ,స్ప్రింగ్ వుడ్స్ , ప్రణీత్ నతురల్ బౌంటీ మరియు ల్యక్ రిడ్జ్ కాలనీ వాసులు విన్నపించగా వారు వెంటనే స్పందించి S.E ,D.E మరియు A.E తో మాట్లాడి సబ్ స్టేషన్ మంజూరు చేయించారు.

ఈ సందర్భంగా శంబిపూర్, మల్లంపేట్ మరియు బౌరంపేట్ గ్రామంలో సబ్‌స్టేషన్ ఏర్పాటు స్థలాన్ని పై అధికారులతో పరిశీలించారు .ఈ కార్యక్రమంలో NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, ట్రాన్స్కో SE- రంజీ, ADE- అరుణ్, SE రవికుమార్, DE -జీడిమెట్ల విష్ణువర్ధన్ రెడ్డి, AE బాచుపల్లి- శాంత కుమార్, DE కూకట్ పల్లి -చక్రవర్తి , ADE మియాపూర్-హరికృష్ణ, AE భౌరంపేట్- సాయికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS