
Study with concentration and reach higher positions: Vikarabad MLA Dr. Metuku Anand
ఏకాగ్రతతో చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మునిసిపాలిటి పరిధిలోని కొత్తగడిలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో నిర్వహించిన స్వచ్ఛ గురుకుల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విద్యార్థులందరు చిన్నతనం నుండి పరిశుభ్రమైన జీవన విధానం అలవర్చుకోవాలన్నారు.
అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేసి, మెడిసినల్ గార్డెన్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో CTO శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ అపర్ణ, వారి సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.