Study material for female students by Greater Atlanta Telangana Society
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ వారిచే విద్యార్థినిలకు స్టడీ మెటీరియల్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
అమెరికాకు చెందిన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ వారిచే చింతకాని మండలంలోని కేజీబీవీ లచ్చగూడెం లోని పదవ తరగతి చదువుతున్న బాలికలకు స్టడీ మెటీరియల్ అందజేత, అట్లాంటా తెలంగాణ సొసైటీ సుమారుగా రెండు దశాబ్దాలుగా జార్జియా రాష్ట్రంలో సేవలను అందిస్తుంది, గేట్స్ యొక్క ప్రధాన ఉద్దేశ్యమేమిటంటే తెలంగాణ సంస్కృతిని ఆట పాటలను భావితరాలకు అందిచడం అంతేకాకుండా అమెరికాలో నివసిస్తున్న ఆర్థికంగా వెనుకబడినవారికి సహాయ సహకారాలను అందించటం అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు నిత్యావసర వస్తువుల పంపిణి చేయటం,
గ్రామీణ ప్రాంతాల పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, శానిటైజ్ పాడ్స్ అందించటం, వృద్దులకు దుప్పట్ల పంపిణి, ఇలా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు, ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించి 10 వ తరగతి పిల్లలకి స్టడీ మెటీరియల్ అందించిన డాక్టర్ శ్రీని గంగసాని గారికి ప్రతేక ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన గ్రేటర్ అట్లాంటా, సభ్యులకు, సలహాదారులకు,బోర్డు మెంబర్స్కి, కేజీబీవీ ప్రిన్సిపాల్ శ్రీమతి టి మంజుల వారి సిబ్బంది మరియు పదవ తరగతి చదువుతున్న బాల బాలికలు, తమ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు ,
ఈ కార్యక్రమంలో చింతకాని మండల తహసిల్దార్ ఎం మంగీలాల్, మండల ఎంపీడీవో ఎంపీడీవో టి శ్రీనివాసరావు, ఎంపీడీవో ఆఫీస్ సూపర్డెంట్ సిహెచ్ రాజ్యలక్ష్మి, ఆఫీస్ సిబ్బంది ఆర్వి శ్రీనివాస్, మండల వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, గ్రామ సర్పంచ్ ఝాన్సీ రాణి, గ్రామపంచాయతీ సెక్రటరీ కె శ్రీరాంకుమార్, పంచాయతీ సిబ్బంది ఏ అప్పారావు ఏ అప్పారావు, మరియు చింతకాని మండల ప్రత్యేక అవసరాల దివ్యాంగబాల బాలికల సమన్వయకర్త కవికొండల శ్రీనివాస కృష్ణారావు ఐఈఆర్ పి పాల్గొన్నారు