SAKSHITHA NEWS

మదర్సాలో ఉండే విద్యార్థులు మౌల్ సాబ్ కోసం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సొంత నిధులతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గొప్ప మనసు చాటుకున్నారు

కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఓల్డ్ బోయిన్ పల్లి హఫీజ్ పేట్ లో మదర్సా సిరాజుల్ ఉలుం లో 400 మంది చదువుకునే విద్యార్థులు , మౌల్ సాబ్ కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి పరిశీలించారు. అనంతరం చదువుకునే విద్యార్థులు మౌల్ సాబ్ ఇబ్బందులు పడకుండా కరెంట్ బిల్లు కట్టకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే సొంత నిధులు 26 లక్షల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు విద్యార్థులకు అన్ని వర్గాల వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా తానుండగా ఉంటానని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తనను సంప్రదించవచ్చని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, మౌలానా ఖలీద్ సాహెబ్, మౌలానా సాబీర్ సాహెబ్, మార్గుబ్ అలం సాహెబ్, నరేందర్ గౌడ్, గౌసుద్దీన్, ఇర్ఫాన్ సాహెబ్, సయ్యద్ సాహెబ్ జంగయ్య, మెహరాజ్, హోమర్ , బాబా కబీర్ విజయ్ హరినాథ్, షేక్ అహ్మద్ లు పాల్గొన్నారు


SAKSHITHA NEWS