SAKSHITHA NEWS

Students should develop confidence to face any situation..

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలి…

ఇగ్నైట్ ఐఏఎస్ ఖేలో ఇగ్నైట్ – 2022 స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి వద్ద ఇగ్నైట్ ఐఏఎస్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖేలో ఇగ్నైట్ – 2022 స్పోర్ట్స్ మీట్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజీ స్కాలర్ షిప్ బ్రోచర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అనుకున్న లక్ష్య సాధన దిశగా విద్యార్థులు అడుగులు వేయాలన్నారు. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదన్నారు.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. ఇగ్నైట్ ఐఏఎస్ వారు విద్యార్థుల కల సాకారం కోసం అందిస్తున్న వారంవారీ ప్రిలిమ్స్ పరీక్షలు, అనుభవజ్ఞులైన లెక్చరర్ల నుండి ఉత్తమ మార్గదర్శకత్వం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, వారపు సెమినార్లు, క్విజ్ పోటీలు, సాఫ్ట్-స్కిల్స్, క్రీడలు, ప్రతి సంవత్సరం క్రీడా సమావేశాలు,

సాంస్కృతిక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరాలన్నారు. తెలంగాణలోని విద్యార్థులను వారి స్వంత మార్గాన్ని సృష్టించుకోవడానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి స్థిరమైన సేవలు ఇంటిగ్రేటెడ్ కోర్సుల ద్వారా ఇగ్నైట్ ఐఏఎస్ వారు అందించడం అభినందనీయం అన్నారు.

స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ద్వారా గ్రామ స్థాయిలో ఉత్తమ విద్యార్థులను చేర్చుకోవడానికి చేస్తున్న కృషి సంతోషదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ ఇగ్నైట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్ డప్పు కిరణ్ కుమార్, కోఆప్షన్ మెంబర్ వెంకటేష్,

మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, నాయకులు దేవేందర్ యాదవ్, మహేష్, మధు, యాదగిరి, పద్మారావు, కాలేజీ చీఫ్ మెంటార్ ఎన్.ఎస్.రెడ్డి, డైరెక్టర్ సీఎం.ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS