విద్యార్థులు మత్తు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అవగాహన నిఘ ఉంచాలని అధికారుల కు సూచించిన ……. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
……………………………………………………………………………………
*సాక్షిత వనపర్తి :
విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల జోలికి పోకుండా అవగాహనతో పాటు నిఘా ఉంచాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు.
మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల, కే.జి.బి.వి ల్లో కమిటీ ద్వారా అవగాహన కల్పించడంతో పాటు నిఘా పెట్టాలన్నారు. పోలీస్ శాఖ ద్వారా మత్తు పదార్థాలను గుర్తించి శునకాలతో తనిఖీ చేయించాలని పోలీస్ శాఖను సూచించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఇప్పటి వరకు ఉన్న గంజాయి సాగు కేసులపై వివరాలు అడిగారు.
ఎక్కడైనా మాదక ద్రవ్యాల ఉత్పత్తి కానీ వాడకం కానీ జరిగినట్లు తెలిస్తే 8712671111 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం వాటి అనర్తాల పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ యం . నగేష్, ఆర్డీఓ పద్మావతి, అడిషనల్ ఎస్పీ తేజావత్ రామదాసు నాయక్, విద్యా శాఖ అధికారి గోవిందరాజులు, సంక్షేమ శాఖ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు మత్తు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అవగాహన నిఘ
Related Posts
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్
SAKSHITHA NEWS ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ శంకర్పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో…
ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత
SAKSHITHA NEWS ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత 52వ రాష్ట్రీయ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిసాక్షిత వనపర్తి 52వ రాష్ట్రీయ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలకు సార్ధకత చేకూరేల, ఉపాధ్యాయులు…