SAKSHITHA NEWS

డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుపై విద్యార్థినీల హర్షం..!!

  • తాడ్వాయి తెలంగాణ ప్రభుత్వం వసతి గృహ విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ చార్జీలను పెంచినందుకు, ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు హాస్టల్ వార్డెన్ లక్ష్మి తో కలిసి, హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 2017 నుండి ఇప్పటివరకు విద్యార్థులకు కాస్మెటిక్ డైట్ చార్జీలు పెంచకపోవడం మేము ఎంతో ఇబ్బందులకు గురయ్యామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాస్మోటిక్ మిస్ చార్జి పెంచడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులమైన మాకు సరైన పౌష్టికాహారం అందించే విధంగా అన్ని వసతి గృహాల్లో సక్రమంగా అమలయ్యే విధంగా తీసుకున్నందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు


SAKSHITHA NEWS