మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం మండుటెండలో కూర్చొని తింటున్నారు.
గత ప్రభుత్వ హయంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా డైనింగ్ హాల్ మంజురై, గోడలు కూడా కట్టారు. ఇంతలోనే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి.
దీంతో తినడానికి కనీసం నీడ కూడా లేకపోవడంతో విద్యార్థులు మండుటెండల్లోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.