SAKSHITHA NEWS

విద్యార్థులు విద్యతో పాటు సమాజం పైన, పోలీస్ అందిస్తున్నా సేవల పైన అవగహన పెంచుకోవాలి

జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపీఎస్

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ(పోలీస్ ఫ్లాగ్ డే) లో భాగంగా పోలీస్ పరెడ్ గ్రౌండ్ లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన చివరి రోజు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని అవగహన కల్పించారు

విద్యార్థులు చదువులో చురుకుగా ఉండటం తో పాటు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాల పై, పోలీస్ వ్యవస్థ ప్రజలకు అందిస్తున్న సేవల పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ఓపెన్ హౌస్ స్టాల్స్ ను వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులకు సూచించారు.

ఓపెన్ హౌస్ స్టాల్స్ మూడవ రోజు (చివరి రోజు) లో బాగంగా SR ఇంటర్నేషనల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కు చెందిన 600 మంది విద్యార్థులు ఈ రోజు ఓపెన్ హౌస్ స్టాల్స్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఉద్ధ్యేశించి జిల్లా ఎస్పీ విద్యార్థులతో మాట్లాడుతూ…. పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీస్ శాఖ పనితీరు, వివిధ అంశాలపై విధ్యార్ధిని, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఊదేశ్యంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని 3రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాల పై అవగహన పెంచుకోవాలని అన్నారు. విద్యార్ధులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని ఫంక్షన్నింగ్ ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అందు కోసం షి టీం, సైబర్ సెక్యూరిటీ వింగ్, కమ్యూనికేషన్, ఆంటీ డ్రగ్ యూనిట్, ఆయుధ ప్రదర్శన, డాగ్ స్క్వాడ్, బీడీ , బాంబు డిస్పోజల్ స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
అలగే విద్యార్ధులు భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కష్టపడి చదవాలని, మొబైల్స్ ను అవసరం మేరకు వినియోగించాలని అనవసరమైన లింక్ లు ఓపెన్ చెయ్యడం వల్ల, ఫోటోస్ డీపీ పెట్టుకోవడం వల్ల ఫోటోస్ మార్పింగ్ జరిగి సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం అన్నందున జాగ్రత్తగా ఉండాలనీ సూచించారు .

ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వివరించిన విషయాలు…..

  • ఫ్రెండ్లీ పొలిసింగ్ విధానం ద్వారా ప్రజలకు దగ్గర అవుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం డే/నైట్ బీట్స్, పెట్రోలింగ్ వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తాయి.

• పోలీసు శాఖ నేరస్తులను సులువుగా గుర్తించడం కోసం అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి నూతన సాంకేతికతల గురించి వివరించారు.

  • నేరాలు జరగకుండా నివారించడంలో మరియు జరిగిన నేరాన్ని త్వరగా చేదించడం లో సి.సి కెమెరాలు ఏవిధంగా ఉపయోగపడతాయి.
  • మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటయిన షీ టీమ్ లు, భరోసా సెంటర్ ఏవిధంగా పని చేస్తాయి.
  • పోలీస్ శాఖ ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, ఏ సందర్భాలలో ఉపయోగపడతాయి అని వివరించడం జరిగింది.

•బాంబ్ స్క్వాడ్స్ ఏవిదంగా బాంబులను నివృత్తి చేస్తుంది

• సైబర్ నేరాలగురించి ఏవిధంగా అప్రమత్తంగా వుండాలి, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచేయాలకు దూరంగా ఉండాలని, ఏదైనా సైబర్ క్రైమ్ కు గురి అయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదు నమోదు చేయాలని వివరించడం జరిగింది.

ముఖ్యమైన కేసులలో నిందితులను, దొంగలను, పేలుడు పదార్థాలను డాగ్స్ ద్వారా ఏ విధంగా గుర్తించడం

పై విషయాలకు సంబంధించి అర్మోరర్లు, బాంబ్ స్క్వాడ్ టీం, IT Core, భరోసా సిబ్బంది, షిటీమ్, ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్  సిబ్బంది   విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరును వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమాలలో సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు, ఆర్.ఐ లు వెంకటేష్, హారీఫ్, అర్ . ఎస్సై లు 600 మంది SR స్కూల్, సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS