Student of Telugu Book of Records Sarvajna School
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్వజ్ఞ పాఠశాల విద్యార్థి
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
నగరంలోని వి.డి.వోస్ కాలనీలోని సర్వజ్ఞ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఇస్సంపల్లి సాయిగణేష్ భార్గవ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి పతకాన్ని సాధించాడు. హైద్రాబాద్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ నిర్వాహకులు అతనికి ఈ మేరకు ధృవపత్రాన్ని అందజేసి పతకంతో సత్కరించారు.
కీబోర్డ్ పై అతి తక్కువ సమయంలో 15పాటలకు నేపథ్య సంగీతం అందించి తనలోని ప్రతిభను చాటుకున్నాడు. ఈ క్రమంలో భార్గవ్‌కు ఆ పుస్తకంలో చోటు లభించింది. ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్ధి ఇస్సంపల్లి సాయిగణేష్ భార్గవ అభినందించారు.
తమ స్కూల్ విద్యార్థులను చదువుతో పాటు అన్ని రకాల అంశాలలో ప్రోత్సాహించి ముందుంచడానికి వినూత్న ప్రణాళికలలో ముందుకెళ్తున్నామని తెలిపారు. విద్యార్థులలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను వెలికితీసి తీర్చిదిద్దేందుకు తమ విద్యాసంస్థలో విద్యార్థులకు విద్యతో పాటు సంగీతం, సాహిత్యం, నృత్యం,
పెయింటింగ్ వంటి కళలో ప్రత్యేక శిక్షణను క్రమం తప్పకుండా అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పతక గ్రహీత భార్గవను ఆయనతో పాటు డైరక్టర్ నీలిమా, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అభినందించారు.