Strong arrangements for physical fitness tests: Additional DCP Admin
శారీరక సామర్ధ్య పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు: అడిషనల్ డీసీపీ ఆడ్మీన్
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
త్వరలో నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్ధ్య పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ డా,,శభరిష్ తెలిపారు.
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధి పోలీస్ కానిస్టేబుల్ , ఎస్సై ఉద్యోగాల ఎంపికలో భాగంగా త్వరలో ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న శారీరదారుఢ్య పరీక్షల నేపథ్యంలో శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధిత అధికారులతో కలసి అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ను సందర్శించి పరిశీలించారు
.
వేల సంఖ్యలో అభ్యర్థులు ప్రిలిమినరీ రాత పరిక్షలో అర్హత సాధించి తదుపరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కు హజరైయ్యేందుకు సిద్ధంగా వున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న మైదానాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
అభ్యర్థులు గ్రౌండ్స్ ప్రవేశం నుండి తిరిగి బయటకు వచ్చే వరకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా సజావుగా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకొవాలని సూచించారు.
గ్రౌండ్స్ పరిసరాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ , బయోమెట్రిక్, 1600 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షార్ట్ పూట్, ఎత్తు కొలతల ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే విషయాలను అధికారులు చర్చించి పరిశీలించారు.
కార్యక్రమంలో పోలీస్ అధికారులు, కమ్యూనికేషన్స్, మినిస్ట్రీయల్ స్థాఫ్, ఐటి కోర్ టీమ్ పాల్గొన్నారు.