SAKSHITHA NEWS

సామజిక మాధ్యమాలలో పోస్టులు పెడితే కఠిన చర్యలు.

-సోషల్ మీడియా వేదికగా విద్వేషకర,రెచ్చగొట్టే,అనుచిత పోస్టులపై నిఘా

-మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షణ

….పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

లోకసభ సాదారణ ఎన్నికల నియమావళి అమల్లో వున్నందున ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోషల్‌ మీడియా పోస్టులపై మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షణ వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. విఘాతం కలిగించే ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేసినా, వ్యక్తిగత దూషణలకు పాల్పడినా, ఇతరులను హెచ్చరిస్తూ పోస్టులు పెట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని పెర్కొన్నారు. సోషల్ మీడియా సైట్ల పై కమిషనరేట్ సోషల్‌ మీడియా యూనిట్‌ ఆధ్వర్యంలో 24/7 నిఘా పెట్టి పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున
వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మొదలగు వాటిలో
పౌరులు బాధ్యతగా నడుచుకోవాలి సూచించారు.
ఎవరైనా ఇతర వ్యక్తులను, రాజకీయ పార్టీలను ఉద్దేశించి అనుచితమైన వాఖ్యలు, అనుచిత పోస్టింగ్ లు పెడితే చట్టప్రకారం కేసులు నమోదు చేసి, ఎలక్ట్రానిక్ డివైజ్ లు సీజ్ చేస్తామని అన్నారు.

WhatsApp Image 2024 04 29 at 8.36.30 PM

SAKSHITHA NEWS