ప్రకాశం జిల్లా తేది:10.09.2023
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రజల సాధారణ జనజీవనం మరియు రాకపోకలకు ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపిఎస్
టీడీపీ అధినేత ఎక్స్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి కోర్టు వారు విధించిన రిమాండ్ నేపథ్యంలో జిల్లాలో ఎవరైనా బలవంతంగా షాపులు మూపించడం కానీ, బలవంతంగా స్కూళ్లు,కాలేజీలు తదితర విద్యాసంస్థలు మూపించడం కానీ చేసినచో అలాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజల సాధారణ జన జీవనం మరియు రాకపోకలకు బలవంతంగా ఎలాంటి అసౌకర్యం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
జిల్లాలో 30 పోలీసు యాక్టు అమలులో ఉందని… ఎవరూ ఉల్లంఘించరాదని, ఎవరైనా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.అల్లర్లకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
సోమవారం తలపెట్టిన బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని,ప్రజల సాధారణ జన జీవనం మరియు రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు