గంజాయి, కల్తీకల్లు, అల్ట్రాజోలం, డైజోఫార్మ్ అమ్మితే కఠిన చర్యలు: సిఐ వీరబాబు గౌడ్
శంకర్పల్లి: గంజాయి, కల్తీకల్లు, అల్ట్రాజోలం, డైజోఫార్మ్ ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని మోకిల సిఐ వీరబాబు గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ మత్తు పదార్థాలను త్రాగటం వలన ప్రాణం పోతుంది. గంజాయి, కల్తీ కల్లుని నిర్మూలించాలని, మన సమాజాన్ని కాపాడుకోవాలని కోరారు. ఎవరైనా అమ్మినట్లు తెలిసినట్లయితే ఈ ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని (87126 71111) పేర్కొన్నారు.