SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జలవాయు విహార్ కాలనీ లో చేపడుతున్నటువంటి స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలియజేసారు.

అదేవిధంగా డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, కాలనీ వాసులు వివేక్, URK ప్రసాద్, విట్టల్ , పీవీ రావు, వర్మ, శ్రీనివాస్, కృష్ణన్, మునికృష్ణ, ఆంజనేయులు, RS రెడ్డి, ఈశ్వర ప్రసాద్, సతీష్, శ్రీకాంత్, రవి, నాగేశ్వర్ రావు, సైదేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS