Steps to solve the problems of Warangal Railway..
వరంగల్ రైల్వే పరిదిలోని సమస్యల పరిష్కారానికి అడుగులు..
ఐదు ప్రదాన రైల్వే సమస్యలను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం కు కోరిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
-వరంగల్ తూర్పు లో రైల్వే సమస్యలపై రైల్వే జీఎంను కలిసిన ZRUCC మెంబర్,ఎమ్మెల్యే నన్నపునేని..సానుకూలంగా స్పందించిన రైల్వే జీఎం..
ఈ రోజు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ని వరంగల్ శాసనసభ్యులు,ZRUCC మెంబర్ నన్నపునేని నరేందర్,ZRUCC మెంబర్ చింతాకుల సునీల్,కార్పోరేటర్ చింతాకుల అనీల్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై వినతి పత్రం అందజేసారు.
.వరంగల్ తూర్పు లోని వరంగల్ రైల్వే స్టేషన్ కు సంబందించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్,రుక్కమ్మ హోటల్ దగ్గర అండర్ వెంట్ నిర్మాణం,ఫుడ్ షెడ్ ప్లాట్ ఫాం,ఆటో స్టాండ్ ఏర్పాటు,పుష్పుల్ పాసింజర్ రైలు ప్రజల సౌకర్యార్థం నిత్యం ఉదయం వరంగల్ నుండి సికింద్రబాద్ నడిపే విదంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తన వినతిలో పేర్కొన్నారు.
.దానికి వారు సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలు పంపించమని సూచన చేసారు..మున్సిపల్ కౌన్సిల్ నుండి ప్రతిపాదనలు పంపించి అందుకు తగు ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే నరేందర్ జీఎంకు తెలిపారు..