SAKSHITHA NEWS

పిడుగురాళ్ల — గురజాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 10 వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలనందు ప్రపంచ మాదక ద్రవ్యాల రవాణా వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా విద్యార్థి, విద్యార్థినులకు న్యాయవాదులచే న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. బార్ ప్రెసిడెంట్ ఎస్.కె జానీ భాష మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా మాదకద్రవ్యాలకు అలవాటు పడితే అతని ఆరోగ్యం చెడిపోయి ఇబ్బందులకు గురవుతారని అన్నారు. న్యాయవాది కలివేల ప్రభుదాసు మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడితే తనతో పాటు తన కుటుంబాలకు కూడా నష్టం చేసినట్లేనని అందువలన మాదగద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులను కోరినారు. న్యాయవాది బి జ్ఞానసుందరి మాట్లాడుతూ మీరు మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అదాలత్ సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినిలు
పాల్గొన్నారు.


SAKSHITHA NEWS