జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్టైల్ పార్క్ స్థలాలను పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కొడకండడ్లలోని అంబేద్కర్ కాలనీ ఎదురుగా గల ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం రామవరం రోడ్డులో గల స్థలాన్ని మంత్రి పరిశీలించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కామెంట్స్:
మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా త్వరలో కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన
కనీసం 20 ఎకరాల స్థలం అవసరం కాగా, భవిష్యత్తు అవసరాల రీత్యా అంతకంటే ఎక్కువ స్థలాన్ని పరిశీలిస్తున్నాం
అంబేద్కర్ నగర్ ఎదురుగా గల 50 ఎకరాల స్థలాన్ని పార్క్ కి అప్పగిస్తే భవిష్యత్తులో టెక్స్టైల్ పార్క్ విస్తరణకు ఎక్కువ అవకాశాలు
అలాగే రామవరం రోడ్డులో గల పది ఎకరాల స్థలం, అదనంగా మరోచోట 18 ఎకరాల స్థలం కూడా టెక్స్టైల్ పార్కు అప్పగించాలని ఆలోచిస్తున్నాం
ప్రస్తుతం స్థలాలను పరిశీలిస్తున్నాం. అన్ని రకాల పరిశీలనల తర్వాత స్థలాల కేటాయింపు జరుగుతుంది.
కొడకండ్ల లో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో ఇక్కడి ప్రజల కష్టాలు తీరనున్నాయి
వలస వెళ్లే ఇక్కడి ప్రాంతాల ప్రజలు తిరిగివచ్చే అవకాశం.
వేలాది మందికి ఉపాధి దొరికే అవకాశం
కొడకండ్ల ప్రాంత అభివృద్ధికి అవకాశం
ఇక్కడి చేనేత కార్మికులకే కాక, చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఇతర వర్గాల ప్రజలకు కూడా ఉపాధి లభిస్తుంది
మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో కొడకండ్ల రూపు రేఖలు మారరున్నాయి
కేటీఆర్ చేతుల మీదుగా త్వరలోనే శంకుస్థాపన జరుగుతుంది
సాధ్యమైనంత వేగంగా స్థల సేకరణ కేటాయింపు జరగాలని అధికారులని ఆదేశించిన మంత్రి ఎర్రబెల్లి
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో కృష్ణవేణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.