State Medical and Health Minister Tanniru Harish Rao laid the foundation stone for the four-lane BT road works.
నాలుగు వరసల బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.
సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడ నుండి కర్ధనూరు ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు 121 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు వరసల బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. హాజరైన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం శ్రీ సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు రాజగోపురాలు, నిత్య అన్నదాన సత్రం, కళ్యాణ మండపం, 24 దుకాణాల సముదాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. హాజరైన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాయికాడి విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.