SAKSHITHA NEWS

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన రాష్ట్ర ప్రభుత్వం

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఖాజా నగర్ మస్జీద్ ఎ గరీబ్ నవాజ్ దర్గా వద్ద బిఆర్ఎస్ ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా (నూతన వస్త్రాల కిట్) ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా పేద ముస్లిం కుటుంబాలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ బతుకమ్మ పండుగకు, క్రిస్మస్ వేడుకలకు, రంజాన్ వేడుకలకు పేద కుటుంబాలకు బట్టలు పంపిణీ చేయడం గొప్ప విషయం అని కొనియాడారు.

పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు కూడా మసీద్ కమిటీ వారు రంజాన్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, మైనారిటీ విభాగం అధ్యక్షులు ఎండి షరీఫుద్దీన్ (కైసర్), మసీద్ కమిటీ అధ్యక్షులు ఎండి సుల్తాన్, జనరల్ సెక్రటరీ ఎండి ఖలీమ్, మైనారిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు షేక్ బీబీ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు షౌకత్ అలీ మున్నా, పోశెట్టి గౌడ్, సాయిగౌడ్, నజీర్, మసిద్ కమిటీ సభ్యులు సయ్యద్ ఫయాజ్, ఎండి సలీమ్, ఎండి ఖాజా, ఎండి గౌస్ పాషా, ఎండి మహముద్, ఎస్ డి రజాక్, ఎండి గౌసుద్దీన్, ఎండి ఇక్బాల్, ఎండి గఫుర్, ఎండి ఖలీమ్, ఇక్బాల్, ఎండి జబ్బార్, ఎండి అమీర్, ఎండి సద్దాం తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS