తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
- తెనాలిలో అన్న క్యాంటీన్ కు అడ్డుపడడం దారుణం
- అడ్డంకులు సృష్టించినా టిడిపి నిర్వహించి తీరుతుంది
- రాష్ట్రంలో పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యం
- టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
సాక్షిత గుడివాడ : తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా అడ్డుపడడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్
శిష్ట్లా లోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతూ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబు, నారా లోకేష్, ఇతర ముఖ్య నేతల పర్యటనలను అడ్డుకోవడం సర్వసాధారణంగా మారిందన్నారు. అలాగే వైసిపి నేతల పర్యటనల సందర్భంగా టిడిపి నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారన్నారు. అక్రమంగా కేసులు బనాయించి జైలు పాలు చేస్తున్నారన్నారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను కూడా ధ్వంసం చేస్తున్నారన్నారు. నందిగామ, మంగళగిరి ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లకు అడ్డుపడ్డారని మండిపడ్డారు. కుప్పంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని అన్నారు. కుప్పం పర్యటనలోనే ఉన్న చంద్రబాబు వైసిపి గుండాల చర్యలను తిప్పి కొట్టారని గుర్తు చేశారు. కుప్పంలో అన్న క్యాంటీన్ ను పునర్నిర్మించి చంద్రబాబు స్వయంగా పేద ప్రజలకు భోజనం వడ్డించారని తెలిపారు. కుప్పంలో వైసీపీ శ్రేణుల దురాగతాలను ప్రతిఘటించిన దాదాపు 60 మంది టిడిపి నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపారని చెప్పారు. వీరందరినీ నారా లోకేష్ స్వయంగా కలిసి పరామర్శించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం జైలుకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలను నిజమైన హీరోలుగా నారా లోకేష్ అభివర్ణించారని చెప్పారు. వీరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని అన్నారు. ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ కు అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి మార్కెట్ కాంప్లెక్స్ వద్ద వాతావరణం తలపించేలా వ్యవహరించారని చెప్పారు. తెనాలిలో అన్న క్యాంటీన్ కు అడ్డుపడడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ ను టిడిపి నిర్వహించి తీరుతుందని చెప్పారు. వైసీపీ శ్రేణులు అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం పేద ప్రజల ఆకలిని తీరుస్తుందని శిష్ట్లా లోహిత్ పేర్కొన్నారు.